13, మే 2025, మంగళవారం

ఎంత పని చేశావు...

నీవు బ్రతికుండగా, పలకరించిన వారెందరు,
నీవు పోయాక నీకై రోదించేది ఎవరు.

నీవు కలిసి ఆడిన ఆటకు తెలుసు ,
నీతో కూడా ఆడింది ఎందరో.
మెలిసి వెళ్లిన సినిమాకు తెలుసు
నీతో కూడా చూసింది ఎందరో.

నిరుత్సాహం నిన్నావరిస్తే,
ఉత్సాహం నింపే వారి ఊసేలేక
క్రుంగుబాటు క్రుంగ చేస్తే,
చెయ్యందించి పైకి లేపే వారే లేక.


ప్రాణముండగా, పరిచయస్తులే, పరాయొల్లయ్యారు.
పలకరించే వారే, నీకు కను మరుగయ్యారు.
నీ ఒంటరి తనానికి,నీవొక్కడివే స్నేహితుడవై .
ఇంతటి ఈ లోకంలో, నీవొక్కడివే ఒంటరివై .
భారమెంతో మోశావు, నీ కున్న బలమునంత కూడదీసి.

మరి అలసి, సెలవు అన్నావో !
లేక,ఈ లోకం నిలువ నెలవి కాదను కున్నావో !!


నీవు కనులు మూయగానే
ప్రతి ఒక్కరి స్టేటస్ లో, నీ చిత్రమే.
ఈ లోకం తీరు, ఎప్పడూ విచిత్రమే .

నీవుండగా లేని శాంతి,
ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తుందా?
ఎంత పని చేశావు నరేషూ !!!

1, డిసెంబర్ 2024, ఆదివారం

రైతు విజయం


కలుపు తీసే చేతులకు,
బలుపు తీయడం తెలుసని,

నాటు వేసే చేతులకు,
పోటు పొడవడం తెలుసని,

కూడు పెట్టే రైతులకు,
కుట్రలు ఆపడం తెలుసని,

ఊరు వాడకు హాని చేస్తే,
ఉరుములా గర్జిస్తామని,

పంట చేనుల జోలికొస్తే,
తాటతీసి తరుముతామని.

చేసిచూపిన మా అక్కలకు,
 అన్నలకు వందనం.

2, అక్టోబర్ 2024, బుధవారం

నా బాధ

నా గుండెను అదిమి పట్టు కోలేను,
నా బాధను మరచి జీవించలేను,
నీవున్నన్నాళ్లు నన్నాదరించావు,
నీ ప్రేమను పంచావు.

నీ కన్నీళ్లను పంచుకున్నానే గాని,
నీ కష్టాలను కాదుగా !
ఇక నేనెన్నాళ్లు ఏడ్చినా,
తీరదుగా నా గుండె వ్యధ !

నే నెప్పుడు ఇంటికి వచ్చినా ఎప్పుడొచ్చావురా,
అని అడిగే ఆ స్వరం ఏమయింది!
నన్ను ఒంటరిగా విడిచి ఎందుకు దూరమయింది !

నా స్వార్థo కోసం నీ కోరిక
తీర్చలేక పోయానో ,లేక
దేవుని తీర్పు నిన్ను తీసుకుపోయిందో
నాకు తెలియదు కానీ!

నువు గుర్తొచ్చిన ప్రతీ క్షణం,
నా గుండె మండుతుంది.


My expression of pain after the loss of my Grandfather

పల్లె అందాలు

పిల్ల గాలుల తాకిడికి
వయ్యారాలు పోయే వరిచేను అందాలు!

తుమ్మెదల తాకిడికి
మై మరచిపోయే పూ
చేలు !

కనులు వాల్చ లేని
సొంపైన దృశ్యాలు!

కనుచూపు మేరలో
నా  పల్లె అందాలు.

ప్రియతమా

మొడుభారిన చెట్టు కొమ్మకు పూసిన,
                                       పుష్పమా !
మూగమొయినా మనసునుండి జాలు వారిన,
                                         మాటవా!
నా  జీవితంలో  వీరభూసిన  ఓ వసంతమా !
నా  పాలిట  పారిజాత  పుష్పమా !
ఓ నా  ప్రియతమా !

అల్పుడవై ఆశించకు

అల్పుడవై ఆశించకు,
ఆధికునిగా బ్రాంతి చెందకు,
అర్హూనివా నీవసలు,
అంతరంగ మందు నీవు,
అడిగి తెలుసుకో !

సాధనేమీ లేకుండా,
సాధించుటకు కాశెందుకు,
బ్రతుకు తెరువుమీద,
నీకు భయమసలే లేనప్పుడు. 

కష్టమేమి లేకుండా,
కార్యమసలు సిద్దించదు,
కలలు కనుటమాని నీవు,
ఇలను చూసి నేర్చుకో!


దాహం

తీరాలెన్ని ధాటిన 
తీరలేదు నా దాహం 
పోరాటలెన్ని చేసినా 
తగ్గలేదు  నా  ఆరాటం 

ఎదురైన వన్నీ 
చేదు అనుభవాలే 
మిగిలి ఉన్నవన్నీ 
మరువలేని జ్ఞాపకాలే 

ఎటు చూసిన 
ముళ్ల  ధారులే 
ఏడారిని  మరిపించే 
ఎండమావులే  

అయినా 
నే  సాధించే వరకు 
ఏ  వ్యాధి నన్ను వేదించలేదు,
ఏ  భాద నన్ను భాదించలేదు 
అందుకే , నే  సాధించక  వదిలేది  లేదు !