1, జూన్ 2007, శుక్రవారం

బంధాలు

మూగబొతున్న మనసులు మనవి
ఆత్మీయతను కోల్పోతున్న అనుబంధాలు మనవి,
అందరూ ఉన్నా, ఎవరూ లేని అనాదగ జీవిస్తున్నాం.
పసివాడి లా వారి పలకరింపుల కోసం ఎదురు చుస్తున్నాం.
పదేపదే పిలిచినా పలకడానికి లేదు వారికిసమయం

దేశాన్ని వదిలివెల్లి
దేహ భాగొగులు మరచి
దేనికొసమని ఆ సంపాదనా
కష్ట కాలమందు తొడూంటారని
కంటి పాపల మిమ్ము పెంచి పెద్దచేస్తే

రెక్కలొచ్చిన పక్షి లా
గూడు వదిలి వెలుతుండ్లు
గురుతులే మరచి పోతుండ్లు
అమ్మ ప్రేమను వద్దని అమెరికాయె ముద్దని
డాడీ తోడు వలదని డాలర్లు చాలని .
బందాలు తెంచుకొని,
బయట పడుతుండ్లు.

Outcasted parents outcry, Ignored by Sons and daughters love and affection

కామెంట్‌లు లేవు: