తీక్షణంగా ఆలోచిస్తున్నాడు వాడు
అమ్మ ఎలాఉంటుందో అని కాదు.
నాన్న ఎక్కడున్నాడో అని కాదు
వాడెందుకు అడుక్కోవాలనో కాదు
వానలో ఇంకెన్నాల్లు తడవాలనో కాదు
గుడి మెట్ల పై నుండి
గుడ్డి ముసలోడు
జారి గుంతలొ పడితె
చెంతచేరి చింతించు వారు లేరని కాదు గానీ
చెయ్యిచ్చి పైకి లేపువారు లేరనే...
వింత చూసుకుంటు
అయ్యయ్యో అనుకుంటు
దాటి పొతున్నారే గానీ....
దయచూపి ఒడ్డుకు చేర్చు వారు లేరనే...
2 కామెంట్లు:
chaala baavundi....
please keep writing these kind...
sure i will try with all ur support. thanks andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి