ఎండ కోసము ఎదురు చూస్తివి
వాన కోసము పడి గాపు కాస్తివి
ఆరుగాలము ప్రయాస పడితివి
జగతి జఠరము నింపడానికి
పగలనక రాత్రనకఎండనక వాననకచలి అనక పులి అనకపంట బాగును ఓ కంట చూస్తివికన్న బిడ్డలా కాపాడు కొంటివి
నడ్డి వంచి గడ్డి తీస్తివి
వడ్డీకి తెచ్చి మందులేస్తివి
కైకిల్లు చూసి కలకలైతివి
రాతమొల్లు లేక రంజుపడ్తివి
పూత పట్టెనని మురిసి పోతివికాయ గాస్తదని ఎదురు చూస్తివిపురుగు పట్టి పూత రాలుతుంటేఏమి తోచక గుండె మండవట్టె
మనసు నిల్వక మందులోడి
మడిగె కెల్తివి
మంచి మందు ఇవ్వ మంటివి
పంట మీద వడ్డీతో ఇస్తనంటివి
పూత నిలిచి కాయ గాసేగానీ కాలమేమో కలిసి రాకపాయేరాబడెమో రాకపాయెరైతు రంది తీరక పాయె !
అర్ధాలు
జగతి = ప్రజలు
ఆరుగాలము = ఏడాది పొడవున, ఎల్లప్పుడు.
జఠరము = కడుపు
కైకిలి = ఎప్పటికప్పుడు ఇచ్చు జీతము ,దినకూలి
రాతము = ప్రతిదినము వాడకము
రంది = చింత, యావ, మనోవ్యాధి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి