28, సెప్టెంబర్ 2024, శనివారం

నీరసం

ఏదో తెలియని అలసట....
ఏదీ చేయాలని అనిపించని సంఘర్షణ...
కాలం ఆగదు గద మనకోసం
కార్యం నిలువదు గా నీకోసం

నీలో ఉన్న ఆత్రుత,
అగుపడకుండా పోయింది.
నీకున్న తపన,
తప్పించుకు తిరుగుతుంది.

తెలియని 
అసమర్థతతా? 
తెలిసినా , 
సందిగ్ధమా ?.

నిన్ను నిలువరిస్తున్నది ఏమిటో,
అశక్తున్ని గావిస్తున్నది ఎందుకో.
అనాశక్తా, అచేతనమా !

అర్ధాలు

సందిగ్ధము = సందేహమైనది ( Doubtful)
అచేతనము = చైతన్యము లేనిది ( Devoid of life)

కామెంట్‌లు లేవు: