2, అక్టోబర్ 2024, బుధవారం

ఓ సునామి

తల్లి భారతి ,
తన పిల్లలను చూసి తల్లడిల్లు తుంటే 

ఇల్లు విడిచిన పిల్లల  కోసం 
కన్న తల్లులు  కన్నీరు విడుస్తుంటే 
కడలి తల్లికి  కాసింతైనా 
కనికరం రాదే !

నిన్నటి  అధికారులను 
నేడు  అనాకారులుగా చేసి 
అన్యాయమెరుగని 
పిల్లలను అనాథలుగా మార్చి 

ఎంతటి  కఠినుడికైనా 
కన్నీరు  తెప్పించే 
కల్లోలాన్ని సృష్టించావు ఓ సునామి 
నిన్ను నిందించను  నేను ఏమని !

(2004 సునామి విపత్తు కలుగ చేసిన కల్లోలం పై  నా  స్పందన )



కామెంట్‌లు లేవు: