4, జూన్ 2007, సోమవారం

తొలి జ్ఞాపకాలు

తొలకరి చిరు జల్లులకు
పులకరించని మనసుంటుందా,
తొలి ప్రేమ ఇక్కట్లను
మరచి పొయే మగువుంటుందా.

నువు ఛీ కొట్టినా...
వాడికి జో కొట్టి నట్లుంది.
నువు ఛీ పొమ్మన్నా
వాడికి రా రమ్మన్నట్లుంది.

నువు ఎంత కాదనుకున్న
నీ యద వాడినే కోరుకుంటుంది
ఎదురు పడగానే
ఏందుకో కోపగించు కుంటుంది.

ఏకాంత సమయాన
ఏందుకాలోచిస్తావు!
వాడు ఏ కాంత తో మాట్లాడిన
మొహం చిన్న బుచ్చుకుంటావు!
ఎంత కాలమని
అంత ప్రేమను దాస్తావు,
ఎందుకే వాడితో దోబుచులాడుతావు.

కామెంట్‌లు లేవు: