29, సెప్టెంబర్ 2007, శనివారం

నా బాల్యం


ఛలి గాలికి చచ్చి బ్రతికి,
జడి వానకు వెరసి నిలచి.
బ్రతికి ఏలు చున్నడు
బహు కఠినపు బాల్యాన్ని.

నేడన్నది క్రొత్త కాదు,
రేపన్నది వింత కాదు.
సొంత మంటు లేదాడికి
ఇంత దయిన లోకంలో.


ఒంటరినని చింతించడు,
ఓదార్పు నెపుడు ఆశించడు
ఆకలేస్తే ఎమిటి,
ఆవేశమస్తే ఎమిటి,
ఆన్నపూర్ణ ఒడిలోనే ఆలమటిస్తు ఉంటాడు .......