19, సెప్టెంబర్ 2024, గురువారం

నేను ...( a cellphone addict)

నే ప్రాణమున్న శిలని
పసితనము లేని బాలని
పగటి పూట కలని
దహించలేని జ్వాలని.

నే వెలుగలేని జ్యోతిని
హర్షించలేని నవ్వుని
వర్షించలేని మేఘాన్ని
ఎడతెగని ఎకాంతాన్ని.

నే మరచిపోయిన జ్ఞాపకాన్ని
గడచిపోయిన నిమిషాన్ని
అదృశ్యమయిన దృ శ్యాన్ని
అందరున్న అనాధని
స్వతంత్య్రమున్న బానిసని
గ్రహింపు లేని వ్యసనిని

Increased addition of cell phone

కామెంట్‌లు లేవు: