12, జులై 2011, మంగళవారం

నా తెలంగాణ

మనమన్నది లేనప్పుడు
నే నెవరైతే నీకెందుకు,
నీ వెవరైతే నాకెందుకు.
కలిసుండాలని లేనప్పుడు
నే నెటువెలితే నీకెందుకు,
నీ వెటువెలితే నాకెందుకు.

పోరుబాట మాదైతే,
పోకిరాట మీదికాదా.
కూటి కోసమె మేం కుమిలిపొతే,
కోట్ల కోసమె మీరు దోస్తికొస్తరు.

నీటి కోసం మేం నలిగిపొతే
నోట్ల కోసం మీరు నలుగగొడ్తరు.
ఆకలితో మేం అలమటిస్తే,
ఆవలింతల్తో మీరు అపహసిస్తరు.

భాష ఒకటె అంటు బంధమేస్తరు,
అ యాస ఎమిటంటూ ఆయాసపడ్తరు.
ఇన్ని చూసి మిన్నకున్నా,
ఇంక మేమే అన్నలంటరు,
తన్ను కుంటూ తమ్ముల్లంటరు.

కామెంట్‌లు లేవు: