28, సెప్టెంబర్ 2024, శనివారం

మాట

ఒకప్పుడు ,
కోటలు  దాటేదాన్ని ,
ఒకరు  నోరు  తెరిచారంటే ,
నే నెక్కడికో వెళ్లేదాన్ని . 

ఓమాట కోసము ఇళ్ళు వదిలి ,
గల్లీలు దాటి వచ్చేవాళ్ళు . 

ఓ పూట  కూడ , తీరిక  లేకుండా 
నే నుండేదాన్ని , 
అందరి  నోళ్ళల్లో నానే దాన్ని !

కయ్యానికి  ఓ  మాటే ,
వియ్యానికి  ఓ  మాటే . 

బ్రతికించాలన్నా  ఓ మాటే 
భయ పెట్టాలన్నా ఓ మాటే. 

అభయం ఇవ్వాలన్నా ఓ మాటే 
అభినందిచాలన్నా  ఓ మాటే 

ఇప్పుడేమో ,
చరవాణి  చె  చెర  పట్టబడి 
పదము  పలికితె   ఒట్టు ,
మాట  అవుతోంది  మట్టు . 

గాలానికి చిక్కిన చేపవోలే ,
అంతర్జాలానికి  దాస్యమాయే ,
మనిషి  భగాలము!
మళ్లే ప్పుడు  చూస్తామో
మాటల కోలాహలము!!



అర్ధాలు

మట్టు = మితము (తక్కువ),తగ్గుదల
భగాలము = పుఱ్ఱె, మానవుని మెదడు
కోలాహలము = బహుజనధ్వని, కలకలము.

కామెంట్‌లు లేవు: